English | Telugu

ఆమెను బోనీ భార్యగానే చూస్తాడంట...!

"ఇష్క్ జాదే" చిత్రంతో హీరోగా బాలీవుడ్ కు పరిచయమైన అర్జున్ కపూర్ అందరికి సుపరిచితుడే. అయితే అర్జున్ తండ్రి బోణీకపూర్ తన తల్లి మోనా కపూర్ ను విడిచిపెట్టి, హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వరుసకు శ్రీదేవి తనకు పినతల్లి అయినప్పటికీ కూడా తను మాత్రం కేవలం బోనీకపూర్ భార్యగానే చూస్తానని ఒక కార్యక్రమంలో అన్నాడు. కానీ తన తల్లి మోనా మరణం తర్వాత తన భాధ్యతల్ని, కెరీర్ ను చక్కదిద్దడంలో చాలా శ్రమించింది. ఆమె అంటే ఇష్టమే కాకుండా గౌరవం కూడా.. తనను తండ్రి బోనీకి చేరువచేయడం కోసం శ్రీదేవి చేసిన ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయమని అర్జున్ అన్నారు.