English | Telugu

జానకిరామ్‌ అంతిమయాత్ర ప్రారంభ౦

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. హరికృష్ణ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రక్రియ ఆరంభమైంది. జానకిరామ్ భౌతికకాయం ఉంచిన వాహనంలో హరికృష్ణ, కళ్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు. హరికృష్ణ నివాసం నుంచి మొదలయ్యే జానకీరామ్ అంతిమ యాత్ర సాయంత్రం 4 గంటలకు మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కు చేరుకుంటుంది. అనంతరం అక్కడే ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. జానకీరామ్ మృతదేహానికి తొలుత పంజాగుట్ట శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహించాలని హరికృష్ణ కుటుంబ సభ్యులు నిర్ణయించినా అనంతరం వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.