English | Telugu

గాయపడ్డ ప్రముఖ గాయని యస్.జానకి

గాయపడ్డ గాయని యస్.జానకి. ప్రముఖ సినీ నేపథ్య సుమధుర గాయని యస్.జానకి మహా పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఒక హోటల్లో బాత్ రూమ్ లో కాలుజారిపడ్డారు. అందువల్ల ఆమెకు తలపైన బలమైన గాయమైంది. ఆమెను వెంటనే స్విమ్స్ (శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కు తరలించారు. తలకు ఏడుకుట్లు పడటంతో పాటు యమ్ ఆర్ ఐ స్కానింగ్ లో తలలో రక్తం గడ్డ కట్టినట్లుగా వైద్యులు తెలిపినట్లు, ఆమె త్వరగానే కోలుకుంటున్నారనీ జానకి కుమారుడు మురళీకృష్ణ మీడియాకు తెలియజేశారు.

తిరుపతిలో జానకి బంధువు, కర్ణాటక శాస్త్రీయ గాయకులు గరిమెళ్ళ బాలకృష్ణ నిర్వహిస్తున్న "అన్నమయ్య మహాయాగం"లో పాలుపంచుకునేందుకుగాను జానకిగారు తిరుపతికి రావటం జరిగింది. ఆమెకు "నైటింగేల్ ఆఫ్ సౌత్" అని పేరు. తెలుగు సినీపరిశ్రమకు జానకిగారు ఒక మధుర గాయనిగా చేసిన సేవలు చాలా కొనియాడతగినవి. ఆమెకు త్వరగా కోలుకోవాలని తెలుగువన్ డాట్ కామ్ ఆ భగవంతుని కోరుకుంటూంది.