English | Telugu
కడుపునిండా అన్నం పెట్టిన లెజెండ్
Updated : Apr 11, 2014
బాలకృష్ణ నటించిన "లెజెండ్" సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని నిన్న హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. చిత్ర బృందానికి బాలకృష్ణ జ్ఞాపికలను అందజేసారు. అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ... ఇదో కలలా ఉంది. ఈ సినిమాలో పాత్రకు నా నిజజీవితానికి సంబంధం ఉంది. జితేంద్రలాగే నేను మొండోడిని. గతంలో పరిశ్రమ నన్ను తరిమేయాలని చూసింది. కానీ నేను ఇక్కడే ఉంటా. పరిశ్రమను వదిలిపెట్టను. మూడు నాలుగేళ్ళ నుంచి ఆకలితో నిద్రలేని రోజులు గడిపాను. కడుపునిండా అన్నం పెట్టిన సినిమా ఇది" అని అన్నారు.