English | Telugu
ఐస్‌క్రీం వచ్చేసింది ఆరగించండి..
Updated : Jul 12, 2014
ఐస్‌క్రీం ఇలా వుంటుంది అలా వుంటుంది అనే కథనాలకు తెరపడింది. ఈ చిత్రం బెంగుళూరులో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా రూపొందించారు. రేను (తేజస్వి) మెడిసిన్ చదువుకుంటుంది. వాళ్లు కొత్తగా ఇల్లు మారుతారు. ఆ ఇంటి చూపించిన ఏజెంట్ ఇంట్లో పూజ చేసిన ఒక బొమ్మని మాత్రం అలాగే వుంచాలని, కదపకూడదని వారికి చెప్తాడు. రేనుని ఇంట్లో వదిలి మిగిలిన వాళ్లు పెళ్లికి వెళతారు. రేను, ఆమె బాయ్ ఫ్రెండ్ విశాల్(నవదీప్) అనుకోకుండా ఏజెంట్ చెప్పిన బొమ్మను తన్నేస్తాడు. అప్పటి నుంచి సినిమా మారిపోతుంది. అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఈ విషయం గురించి రేను చెప్పినా విశాల్ నమ్మడు. అది కేవలం రేను మానసిక పరిస్థితి అని అంటాడు. ఆతర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.. సినిమాలో ముఖ్యంగా, ఎక్కువగా కనిపించిన తేజస్వీ నటన కన్నా, గ్లామర్ తో బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. నవదీప్ నటన పర్లేదనిపిస్తుంది. మిగత క్యారెక్టర్లు కూడా వారి పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాలో ఫ్లో- క్యాం, ఫ్లో - సౌండ్ టెక్నీక్స్ కొత్తగా అనిపించినా, అర్థం కావడానికి సమయం పడుతుంది. ఈ రకమైన దెయ్యం చిత్రాలకు ఈ కొత్త సాంకేతికత బాగా ఉపయోగపుడుతుందనిపిస్తుంది.