English | Telugu

మళ్ళీ విక్రమ్ నట విశ్వరూపం

మళ్ళీ హీరో విక్రమ్ తన నట విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడట. వివరాల్లోకి వెళితే "శివపుత్రుడు", "అపరిచితుడు" వంటి చిత్రాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డులనందుకున్న సౌతిండియన్ స్టార్ విక్రమ్ సినీ రేస్ లో ఈ మధ్య కాస్త వెనకపడ్డాడనే చెప్పాలి. తాను మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్ సరసన నటించిన "విలన్" విక్రమ్ ని చాలా నిరాశపరిచింది. ఈ చిత్రం మీద విక్రమ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.


కానీ తాను ప్రస్తుతం హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం "దైవ తిరు మగన్"లో మరోసారి విజృంభిస్తున్నాడట. ఈ చిత్రం ట్రైలర్లలో విక్రమ్ నటనను చూసిన తమిళ సినీ జనం విక్రమ్ మళ్ళీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ఒక మానసిక వికలాంగుడి (మెంటల్లీ హ్యాండి క్యాప్డ్) గా నటించారట. ఈ చిత్రంలో విక్రమ్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో మళ్ళీ విక్రమ్ జాతీయ అవార్డునందుకుంటాడని కోలీవుడ్ సినీ వర్గాలంటున్నాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.