English | Telugu

కూటమి పై హీరో శివాజీ కామెంట్స్..తిరుపతి ఏడుకొండలవాడు కొత్తగా ఉన్నాడు  

1997 లో చిరంజీవి(chiranjeevi)హీరోగా వచ్చిన మూవీ మాస్టర్. అందులో చిరంజీవి కి స్టూడెంట్ గా నటించడం ద్వారా తెలుగు చిత్ర సీమకి పరిచయమైన నటుడు శివాజీ(shivaji) అక్కడనుంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా, కమెడియన్ గా, హీరోగా ఎన్నో సినిమాల్లో విభీమన్నమైన పాత్రలని పోషించి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందాడు. రీసెంట్ గా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసాడు.

చాలా సంవత్సరాల నుంచి శివాజీ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాడు. మొన్నటి దాకా అధికారంలో ఉన్న వైసీపీ ఏ పి అభివృద్ధి కి పాటు పడటంలేదని చెప్తు వస్తున్నాడు. రీసెంట్ గా ఏపి లో జరిగిన ఎన్నికల ఫలితాలు రావడం వైసీపీ ప్లేస్ లో కూటమి అద్వర్యంలో ఉన్న టిడిపి అధికారంలోకి రావడం జరిగింది. దీంతో ఆయన తిరుమల తిరుపతి ఏడుకొండల వాడిని దర్శించుకున్నాడు. కొండపై ఆయన మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణయుగం మొదలయ్యింది. ఇది స్వామి నిర్ణయం. స్వామి దగ్గర డ్రామాలు ఆడితే ఎవరికైనా శిక్ష తప్పదు. స్వామిని చూస్తే కళకళలాడుతున్నాడు.అంతకు ముందు చూస్తే తేడాగా ఉన్నాడు. ఇప్పుడు అంతా బాగుంది. వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు ఇక చెయ్యద్దు .వెంకటేశ్వర స్వామి లక్ష్యాలు అమరావతి,పోలవరం.. స్వామి దగ్గర మాటిచ్చిన వాళ్లకి ఎలాంటి పాటలు నేర్పించాడో మీరంతా చూస్తూనే ఉన్నారు.ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు,బిజెపి ఆధ్వర్యంలో రాష్టం బాగుంటుంది.ఇక పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలందరు సాటి మనుషులుగా కలిసి ఉండాలి. ఏ ఒక్క వ్యక్తిని నెత్తిన వేసుకొని భుజాన వేసుకొని ఉండకూడదు. అందరు బాగుండాలని చెప్పాడు. శివాజీ తో ఫోటోలు దిగడానికి పలువురు పోటీ పడ్డారు.