English | Telugu

‘అతను పవన్‌ కాదు, తుపాన్‌..’ జనసేనానిని ప్రశంసల్లో ముంచెత్తిన మోది!

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల కోలాహలం ముగిసింది. కేంద్రంలో ఎన్‌డిఎ, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం న్యూ ఢిల్లీలోఎన్‌డిఎ సమావేశాన్ని నిర్వహించింది. ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబుయుడు, పవన్‌కళ్యాణ్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు, పవన్‌ ప్రసంగాలకు సభలో అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్రమోది తన ప్రసంగంలో పవన్‌కళ్యాణ్‌ పేరును ప్రస్తావించడమే కాదు, ప్రశంసించారు.

‘దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే కూటమి చరిత్ర సృష్టించిందని బాబు చెప్పారు. ఇప్పటివరకు ఏ పార్టీకీ అన్ని సీట్లు అక్కడ రాలేదని ఆయన అన్నారు. ఇక ఇక్కడ కూర్చున్న పవన్‌... పవన్‌ కాదు, తుపాన్‌. ఆంధ్రప్రదేశ్‌లోని ఫలితాలు మాకు ఎంతో శక్తినిచ్చాయి’ అన్నారు.