Home

»

Latest News

హ‌రీశ్ శంక‌ర్ కి హ్యాట్రిక్ ఇస్తాడా!

Dec 8, 2021 2:49PM

`మిర‌ప‌కాయ్`, `గ‌బ్బ‌ర్ సింగ్`, `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్`, `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` (డీజే), `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో తెలుగునాట ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేశాడు హ‌రీశ్ శంక‌ర్. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ కెప్టెన్.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ లో `భ‌వదీయుడు.. భ‌గ‌త్ సింగ్!` పేరుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. `గ‌బ్బ‌ర్ సింగ్` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత ప‌వ‌న్, హ‌రీశ్ కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న `భ‌వ‌దీయుడు.. భ‌గ‌త్ సింగ్`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు అందించ‌నున్నారు. కాగా, ఇదివ‌ర‌కు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో డీఎస్పీ చేసిన `గ‌బ్బ‌ర్ సింగ్`, `డీజే`.. ఇలా రెండు సినిమాలు కూడా మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఈ నేప‌థ్యంలో.. `భ‌వదీయుడు.. భ‌గ‌త్ సింగ్`తో హ‌రీశ్ - దేవిశ్రీ కాంబినేష‌న్ హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి. 2022 ద్వితీయార్ధంలో `భ‌వ‌దీయుడు... భ‌గ‌త్ సింగ్` థియేట‌ర్స్ లోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com