English | Telugu
'ఆర్ఆర్ఆర్' లోగోలో చరణ్ ఫోటో ముందు పెట్టడానికి కారణం?
Updated : Dec 11, 2021
శనివారం హైదరాబాద్ లో జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్ రాజమౌళికి టైటిల్ డిజైన్ గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'ఆర్ఆర్ఆర్' టైటిల్ లోగోని గమనిస్తే మొదటి 'ఆర్'లో రామ్ చరణ్ ఫోటో, మూడో 'ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటాయి. రెండో 'ఆర్'లో ఇద్దరి ఫ్రెండ్ షిప్ కి సింబాలిక్ గా హ్యాండ్స్ ఉంటాయి. అయితే టైటిల్ లో మొదటి 'ఆర్' లో చరణ్ ఫోటో పెట్టడానికి కారణమేంటి?.. చరణ్ పాత్ర వయస్సు ఎక్కువ కావడంతో, ముందు చరణ్ ఫోటో పెట్టారా? అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది.
Also Read:తారక్, చరణ్ వల్ల టైం వేస్ట్ అయింది!
మొదట ప్రశ్న సరిగా అర్థంగాక.. 'అలా అలోచించి ఏం పెట్టలేదు. అయినా చరణ్ కంటే తారక్ యే ఒక సంవత్సరం పెద్ద అని' రాజమౌళి అన్నాడు. దీంతో వెంటనే మైక్ అందుకున్న తారక్.. 'ఇప్పుడు నా వయస్సు ప్రస్తావన అవసరమా?.. అయినా అక్కడ అడిగింది మా వయస్సు గురించి కాదు, మేం పోషించిన పాత్రల వయస్సు' అంటూ సరదాగా బదులిచ్చాడు. దీంతో అప్పుడు ఆ ప్రశ్నని కరెక్ట్ గా అర్థం చేసుకున్న రాజమౌళి.. ఊహించని ఆన్సర్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు.
Also read:అక్కడ నేనొకదాన్ని ఉన్నాననే ధ్యాసలేకుండా తారక్, చరణ్ తెగ కబుర్లు చెప్పుకునేవారు!
'ఆర్ఆర్ఆర్' లోగోలో అసలు చరణ్ ముందు ఎక్కడ ఉన్నాడు అంటూ రాజమౌళి కొత్త లాజిక్ చెప్పాడు. టైటిల్ లోగోలో ఇద్దరూ ఒకే వైపు చూస్తున్నారు. తారకే ముందు ఉన్నాడు, తారక్ వెనక చరణ్ ఉన్నాడు అని రాజమౌళి చెప్పారు. రాజమౌళి చెప్పిన ఆన్సర్ తో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇప్పటిదాకా టైటిల్ లోగోలో చరణ్ ఫోటో ముందు ఉందని అనుకున్నారంతా. కానీ తారకే ముందు ఉన్నాడని, తారక్ వెనక చరణ్ ఉన్నాడని చెప్పి రాజమౌళి షాక్ ఇచ్చాడనే చెప్పాలి.