English | Telugu

నటుడు చంద్రహాస్‌పై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు!

సినీ నటుడు చంద్రహాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా అసభ్యకరమైన పాటను పాడినట్లు ఆరోపణలతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ మేరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు.


ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, సినిమా ఈవెంట్ సమయంలో ప్రజల సమక్షంలో అసభ్యకర పదజాలంతో కూడిన పాటను పాడడం వల్ల ప్రజల్లో అసహనం కలిగిందని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉన్న వేదికపై ఈ తరహా ప్రవర్తన అనుచితమని కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు చంద్రహాస్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 296 కింద, అలాగే ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా, ఇదే ఘటనకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కూడా చంద్రహాస్‌పై కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. వరుసగా రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్పులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.మరోవైపు, ఈ ఘటనపై నటుడు చంద్రహాస్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. దర్యాప్తు పురోగతిని బట్టి కేసు దిశానిర్దేశం జరుగనుందని పోలీసులు తెలిపారు.

బాలీవుడ్ లో 90 శాతం పెళ్లిళ్లు ఫేక్.. పూర్తి  డీటెయిల్స్ వివరించిన అగ్ర నటుడు  

భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి ఉన్న ప్రాముఖ్యత తెలిసిందే. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనే నానుడి కూడా అనాదిగా వస్తుంది. కానీ బాలీవుడ్ చిత్ర సీమకి ఇవేమి పట్టవని,అక్కడ జరిగే పెళ్లిళ్లు  తొంబై శాతం ఫేక్ అని ప్రముఖ బాలీవుడ్  నటుడు ప్రతీక్ స్మిత పాటిల్(Prateik smitaPatil)సంచలన కామెంట్స్ చేసాడు. ప్రతీక్ ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని ప్రీవియస్ మూవీ  హిట్ 3 లో విలన్ గా అద్భుతమైన పెర్ ఫార్మ్ చేసి గూగుల్ లో  తన డీటెయిల్స్ సెర్చ్ చేసే అవసరాన్ని తెలుగు ప్రేక్షకులకి కూడా కల్పించాడు. మరి పెళ్లిళ్లపై ఏమంటున్నాడో చూద్దాం.

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది.