Home

»

Latest News

చాన్నాళ్ళ త‌రువాత ఆ పాత్ర‌లో చిరు!

Dec 09, 2021

పోలీస్ పాత్ర‌ల‌కు వ‌న్నె తెచ్చిన క‌థానాయ‌కుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. ఒక ద‌శ‌లో వ‌రుస చిత్రాల కోసం ఖాకీ ధ‌రించి అల‌రించిన సంద‌ర్భాలున్నాయి. అంతేకాదు.. చిరు బాలీవుడ్ డెబ్యూ మూవీ `ప్ర‌తిబంధ్` సైతం కాప్ స్టోరీనే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం అనంతరం మ‌రోసారి పోలీస్ వేషంలో క‌నిపించ‌బోతున్నార‌ట చిరంజీవి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `మెగా 154` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ వెంచ‌ర్.. ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్ళింది. కాగా, ఈ చిత్రంలో చిరు రెండు కోణాలున్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. ప్ర‌థ‌మార్ధంలో ఫోర్ట్ లో ప‌నిచేసే కూలీ త‌ర‌హా పాత్ర‌లోనూ, ఇంట్ర‌వెల్ బ్యాంగ్ నుంచి అండ‌ర్ క‌వ‌ర్ పోలీసాఫీస‌ర్ గానూ మెగాస్టార్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. మెగాభిమానుల‌కు ఇది ఆనందాన్నిచ్చే అంశ‌మే. మ‌రి.. దాదాపు 28 ఏళ్ళ త‌రువాత చిరు పోషిస్తున్న పోలీస్ పాత్ర త‌న‌కి ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తుందో చూడాలి.

కాగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న `మెగా 154` వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి రానుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com