English | Telugu
అల్లు శిరీష్ హీరోగా ప్రకాష్ రాజ్ చిత్రం
Updated : May 30, 2012
అల్లు శిరీష్ హీరోగా ప్రకాష్ రాజ్ చిత్రం. అంటే అల్లు శిరీష్ హీరోగా ప్రకాష్ రాజ్ ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి "గౌరవం" అన్న పేరుని నిర్ణయించారట. ఈ "గౌరవం చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ "గౌరవం" చిత్రంలో హీరోయిన్ గా, యామీ గౌతం నటించనుంది.
యామీ గౌతం గతంలో అల్లరి రవిబాబు దర్శకత్వంలో వచ్చిన "నువ్విలా"అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అనంతరం "విక్కీ డోనార్" అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రంలోని ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ఈ "గౌరవం" చిత్రం దర్శకుడు రాధా మోహన్ గతంలో నాగార్జున హీరోగా నటించిన "గగనం" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.