English | Telugu
బేగం పేట పబ్ లో ప్రభాస్ "రెబల్"
Updated : May 30, 2012
బేగం పేట పబ్ లో ప్రభాస్ "రెబల్" చిత్రం షూటింగ్ జరుగుతుంది. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా, పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేథ్ హీరోయిన్లుగా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.పుల్లారావు, జె.భగవాన్ నిర్మిస్తున్న చిత్రం"రెబెల్". ఈ చిత్రం నిజానికి ఇప్పటికే విడుదల కావలసి ఉంది.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర నిర్మాణంలో ఆలస్యమయ్యింది. ప్రస్తుతం ఈ "రెబెల్" చిత్రం షూటింగ్ బేగం పేటలోని బాటిల్స్ అండ్ చిమ్నీస్ అనే పబ్ లో జరుగుతోంది. అయితే ఈ సీన్లో హీరో ప్రభాస్ పాల్గొనటం లేదని సమాచారం. ఫైటర్స్ తో అక్కడ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారట.