English | Telugu

హరీష్ శంకర్ కి మండితే...!

హరీష్ శంకర్ కి మండితే ఎలా ఉంటుందంటే ఘాటు మిరపకాయ్ ని తిని, తాగటానికి నీళ్ళు లేక షాక్ కు గురైతే ఎలా ఉంటుందో అలాగుంటుంది. వివరాల్లోకి వెళితే ఈ మధ్య హరీష్ శంకర్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా నటించిన "గబ్బర్ సింగ్" సూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రం గురించి ఒక జూనియర్ యన్.టి.ఆర్. అభిమాని ట్విట్టర్ లో " గబ్బర్ సింగ్ ఎలాగూ ఫ్లాపయ్యింది.

కనీసం యన్ టి ఆర్ తో చేసే సినిమా అయినా బాగా తియ్యి" అని అన్నాడట. దానికి హరీష్ శంకర్ "ఇంతకీ నువ్వు ఏ మెంటల్ హాస్పిటల్లో ఉన్నావో చెపితే వచ్చి కలుస్తా"నని అన్నాడట. "గబ్బర్ సింగ్" నిర్మాత గణేష్ లాభాల మీద లాభాలొస్తున్నాయని సంబరపడుతున్న ఆ చిత్రాన్ని ఫ్లాపంటే దర్శకుడు హరీష్ శంకర్ కి కోపం రావటం సహజమే కదా...!