English | Telugu

రామ్ గోపాల వర్మ మొనగాడు

వర్మ మొనగాడు ఎలా అయ్యాడంటే ఒక పెద్ద హీరోతో కోట్లు పెట్టి సినిమా తీసి నానాపాట్లూ పడి విడుదలచేస్తే వచ్చే లాభంకన్నా, ఆరున్నర లక్షలతో, కేనన్ 5డి అనే స్టిల్ కెమెరాతో ఏకంగా అదే పెద్ద హీరోతో సినిమానే తీసి విడుదల చేసి కోట్లు పెట్టిన సినిమా కన్నా ఎక్కువ లాభం సంపాదించాడు. దీన్ని బట్టి చూస్తే వర్మ కచ్చితంగా మేధావి.... మొనగాడు కూడా. వర్మ చెప్పిన విషయాలూ, తన "దొంగల ముఠా" సినిమాతో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ సినిమా "మిరపకాయ్"సినిమాను పోల్చి మరీ నిరూపించాడు. కావాలంటే మీరే చూడండి.

రవితేజ కంపేరటీవ్ టేబుల్
వివరణ
మిరపకాయ్
దొంగల ముఠా
సినిమాకు అయిన ఖర్చు
14 కోట్లు
6 లక్షలు
రిలీజయిన థియేటర్లు
300 లకు పైగా
300 లకు పైగా
ప్రారంభం నుండి ఫినిషింగ్
8 నెలలు
33 రోజులు
రవితేజ పనిచేసిన రోజులు
65 రోజులు
కేవలం 5 రోజులు
తొలి ఆట తర్వాత మొదటి బ్రేక్ ఈవెన్ కి ఇంకా రావలసిన మొత్తం
పెట్టుబడిలో 90%
పెట్టుబడిపైన పదింతలు లాభం

"వెరసి ఒక్క షో తోనే "దొంగల ముఠా" సూపర్ డూపర్ హిట్టయ్యింది. డిష్కషన్ ఓవర్" - రామ్ గోపాల వర్మ

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.