English | Telugu

విష్ణు హీరోయిన్ గా లక్స్ డ్రీమ్ గర్ల్

విష్ణు హీరోయిన్ గా లక్స్ డ్రీమ్ గర్ల్ ని ఎన్నిక చేయనున్నారు. విష్ణు అంటే యువ హీరో మంచు విష్ణువర్ధన్. 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ, స్ప్రింట్ తెలీ ఫిలింస్ కలసి లక్స్ డ్రీమ్ గర్ల్ టాలెంట్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలో గెలుపొంది లక్స్ డ్రీమ్ గర్ల్ గా ఎన్నికైన అమ్మాయిని తను హీరోగా నటించబోయే తదుపరి చిత్రంలో మంచు విష్ణు వర్థన్ హీరోయిన్ గా అవకాశమిస్తారు. ఏప్రెల్ 3 వ తేదీ నుండి హైదరాబాద్ లో తాజ్‍ హోటల్లోనూ, విజయవాడలో మురళీ ఫార్ట్యూన్ లోనూ, విశాఖపట్టణంలో దసపల్లా హోట;ల్లోనూ ఈ టాలెంట్ సెర్చ్ నిర్వహిస్తారు.

సినీ పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయిలు ఎవరిని కలవాలో, ఏ విధంగా హీరోయిన్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతూంటారు. అలాంటి అమ్మాయిలకు ఇదొక సువర్ణావకాశంగా చెప్పవచ్చు. పైన పేర్కొనబడిన సెంటర్లలో ఎన్నికైన 12 మంది అమ్మాయిలతో జెమిని టి వి లో 16 ఎపిసోడ్లు చిత్రీకరిస్తారు. ఆ పోటిలో గెలుపొందిన అమ్మాయికి లక్స్ డ్రీమ్ గర్ల్ కిరీటంతో పాటు మంచు విష్ణువర్థన్ సరసన హీరోయిన్ గా అవకాశం కూడా లభిస్తుంది. ఈ కార్యక్రమానికి నటి స్నేహ మేంటర్ గానూ, యస్.గోపాల రెడ్డి, హేమంత్ మధుకర్ జడ్జిలుగానూ, నటి నిఖిత యాంకర్ గానూ వ్యవహరిస్తారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.