English | Telugu

ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ అదిరింది!

ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ అదిరింది!

డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోలలో ధనుష్ ఒకడు. '3', 'రఘువరన్ బి.టెక్', 'నవ మన్మథుడు', 'మాస్', 'ధర్మయోగి' వంటి సినిమాలతో ధనుష్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా రెండు దశాబ్దాల క్రితం సినీ ప్రయాణం మొదలుపెట్టిన ధనుష్ ఇంతకాలానికి స్ట్రయిట్ తెలుగు మూవీ చేశాడు. అదే 'సార్'.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన 'సార్' చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ధనుష్ నటించిన మొదటి సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో విడుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల నిన్న సాయంత్రమే ప్రీమియర్స్ వేయగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దర్శకుడిగా మొదటి మూడు సినిమాలను రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి.. నాలుగో సినిమాని మాత్రం ఎమోషనల్ జర్నీలా మార్చాడని అంటున్నారు. సందేశంతో పాటు వినోదం, ప్రేమ కలగలిసిన ఈ చిత్రం ధనుష్ కి పర్ఫెక్ట్ టాలీవుడ్ ఎంట్రీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ధనుష్ నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి కమర్షియల్ గానూ విజయం సాధిస్తే ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయినట్లే.