English | Telugu
దేవికి మహేష్ అడ్డు చెప్పాడా...?
Updated : Dec 20, 2013
ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్ లో తన ఆట,పాటలతో అదరగొట్టే ఏకైక ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. దేవి సినిమా అంటేనే ఆ ఆడియో బ్లాక్ బస్టర్ హిట్టని జనాలు ఫిక్స్ అయిపోయారు. అలాంటి దేవి మొదటిసారిగా తన అభిమానులను నిరాశపరిచాడు. మహేష్ సినిమాకు దేవి తొలిసారి సంగీతం అందిస్తున్న "1" చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే నిన్న జరిగిన ఆడియో వేడుకలో దేవి ఎలాంటి హంగామా చేయకుండా అభిమానులకు నిరాశ మిగిల్చాడు. పైగా తన ఈ పాటల్లో రెండు పాటలు మాత్రమే దేవి స్టైల్ లో ఉన్నాయి. మిగతావి అంతంత మాత్రంగానే ఉండటంతో జనాలకు సరిపడే కిక్ దొరకలేదు. మరి దేవి ఇలా స్టేజ్ మీద డాన్స్ చేయకపోవడానికి మహేష్ ఏమైనా అడ్డు చెప్పరా? లేక దర్శక నిర్మాతలు కారణమా అనేది తెలియట్లేదు కానీ... మొత్తానికి "1" ఆడియో వేడుకలో అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.