English | Telugu
దేత్తడి హారిక మరో ‘బేబీ’ అవుతుందా!
Updated : Oct 30, 2023
యూట్యూబ్ ద్వారా దేత్తడి పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా దగ్గరయింది హారిక. దేత్తడి హారిక అనే యూట్యూబ్ ఛానెల్‌లో రకరకాల ఫన్నీ వీడియోస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలా వచ్చిన ఫేమ్‌తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ లో టాప్ 5లో నిలిచింది. ఇక హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుడు కావలెను, శ్రీకారం వంటి మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ లో మెరిసింది కానీ, అంతగా గుర్తింపు రాలేదు. అలాంటి హారిక ఇన్నేళ్ల వెయిటింగ్ కి గాను ఏకంగా మెయిన్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది. యంగ్ అండ్ క్రేజీ హీరో సంతోష్ శోభన్ లీడ్ రోల్ గా చేస్తున్న ఓ మూవీలో అలేఖ్య హారిక హీరోయిన్‌గా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కలిసి నిర్మిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు పెద్ద అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హారికను హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను తెరకెక్కించాలని ఇక ఇప్పటికే కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తనట్లు సమాచారం. ఈ రోజు సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న చిన్న రోల్స్ లో నటించే హారికకు ఇంత పెద్ద అవకాశం వచ్చేసరికి నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.