English | Telugu

చిరుని, నయనతారను కలిసిన డాన్సర్ మురళి....

ఢీ 20 ఈ వారం ఎపిసోడ్ లో చాలా గుడ్ న్యూస్ లు వినిపించాయి. ఇందులో ముఖ్యంగా సోషల్ మీడియాలో చిరంజీవి సాంగ్స్ కి చేసిన డాన్సస్ తో వైరల్ ఐన మురళి బాబాయ్ సెగ్మెంట్. నాగబాబు ప్రామిస్ చేసినట్టుగా మురళి బాబాయ్ ని చిరంజీవితో కల్పించారు. ఇంకా బాబాయ్ వెళ్లి ఆయన కాఫీ తాగి మాట్లాడారు అలాగే ఆయన ముందు కొన్ని స్టెప్పులు వేసి చూపించారు. ఈ విషయం గురించి మురళి బాబాయ్ మాట్లాడుతూ "ఆయన్ని చూస్తుంటే పరమేశ్వరుడిని చూసినట్టు ఉంది. సినిమా షూటింగ్ చేసి వస్తుంటే కుర్రోడిలా ఉన్నారు. అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా సంతోషంగా ఉంది. మురళి గారు ఏడవకండి మీ లైఫ్ బాగుంటుంది. సర్ ఇంకా చనిపోతే చాలు సర్ నాకు. ఎలాగైనా కలవాలి అనుకున్న అవకాశం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు.

నన్ను ఈ స్టేజి వరకు తెచ్చింది అభి మాష్టర్ ఐతే చిరంజీవి గారి వరకు తీసుకెళ్లి పునర్జన్మ ఇచ్చింది ఆది గారు. నా 54 ఏళ్ళ వయసులో నేను ఇలా స్టేజి మీదకు వస్తాను అనుకోలేదు. నేను అనుకున్నది సాధించేసాను " అని చెప్పారు . తర్వాత ఆది మాట్లాడాడు. "రెండు గంటల సేపు కూర్చుని ఆయనతో మాట్లాడారు. చివరిగా ఆయన ఇచ్చిన మాట ఏంటంటే ఏదో ఒక రోజు నా మూవీలో నా పక్కన ఒక చిన్న మూవ్మెంట్ వేస్తావు" అన్నారు. "ఇక అనిల్ రావిపూడి అన్నకి అభిని పరిచయం చేసాను హా నాకెందుకు తెలీదు ఇన్స్టాగ్రామ్ లో మంచి హడావిడి చేస్తుంటాడుగా అన్నాడు. కార్డు ఉందా అని అడిగారు. తీసుకుంటున్నా అని చెప్పాను. తీసుకో త్వరగా అన్నారు. అది చాలు మనకు ఢీ చేస్తున్నాను మనం బయట వాళ్లకు తెలుస్తామో లేదో అనుకుంటాము. బాబోయ్ అందరూ చూస్తున్నారు. పెద్ద పెద్దవాళ్ళే చూస్తున్నారు" అని చెప్పారు ఆది, అభి. "మీసాల పిల్ల సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఆ సాంగ్ హుక్ మూవ్మెంట్ ఇచ్చి ఇది ప్రాక్టీస్ చెయ్యి అని మురళి బాబాయ్ ఇచ్చి వెళ్లారు చిరంజీవి. నిజంగా ఇది మామూలు అదృష్టం కాదు" అన్నాడు ఆది. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ మాట్లాడుతూ "ఢీ 19 వరకు ఒక లెక్క ఈ సీజన్ ఇంకో లెక్క. నేను మొన్న హాలిడేకి దుబాయ్ అబుదాబి వెళ్లాను. అక్కడ జనాలు అడుగుతున్నారు ఈ సీజన్ ఎవరు గెలుస్తారు అని..ఏదో చేసేశాం అనుకోవద్దు. ప్రతీ డీటెయిల్ గమనిస్తున్నారు. మురళి గారు ఆల్ ది బెస్ట్. కుదిరితే మనం కూడా ఎప్పుడైనా తప్పకుండా పని చేద్దాం" అని చెప్పారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.