English | Telugu

సద్బ్రాహ్మణుడైన సత్య ప్రకాష్ భయపెట్టే విలన్ గా ఎలా మారాడు! 

-సత్య ప్రకాష్ అసలు ఎవరు!
-విలన్ గా ఎన్ని సినిమాలు
-సత్య ప్రకాష్ లా నటించే వాళ్ళు ఎంతోమంది
- ఎ ఎస్ రవికుమార్ చౌదరి ఏం చెప్పాడు

సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడంటే విలనిజం యొక్క మేనరిజం, నట ఉదృతి కొంచం తగ్గింది. కానీ ఒకప్పుడు హీరోలకి ఎంత మంది అభిమానులు, వీరాభిమానులు ఉండే వారో, విలన్ కి అదే విధంగా ఉండేవారు. అభిమాన హీరో హావభావాలతో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఎంత మంది ఉండేవారో, విలన్ హావభావాల ప్రదర్శన విషయంలో అభిమానులు తగ్గేదేలే అనే విధంగా ఉండే వారు. అటువంటి కొంత మంది విలన్స్ లో 'సత్య ప్రకాష్' కూడా ఒకరు.మూడు దశాబ్దాల క్రితమే వచ్చిన 'పోలీస్ స్టోరీ' మూవీలో సత్య అనే క్యారక్టర్ లో సత్య ప్రకాష్(Satya Prakash)ప్రదర్శించిన విలనిజాన్ని ప్రాక్టీస్ చేసినవాళ్లు కోకొల్లలు.

పోలీస్ స్టోరీ అనే కాదు చాలా సినిమాల్లోను తనదైన విలనిజంతో మెస్మరైజ్ చెయ్యడం సత్య రాజ్ స్పెషాలిటీ. రీసెంట్ గా 'ఓజి' లోను తన సత్తా చాటాడు. నెగిటివ్ రోల్స్ లో సత్య ప్రకాష్ మేనరిజం చాలా సపరేట్ గా ఉంటుంది. ఆవేశంతో ఒకే డైలాగ్ ని పదే పదే నొక్కి చెప్పడంలో సిద్ధహస్తుడు. అసలు సత్య ప్రకాష్ ప్రదర్శించే విలనిజం చూసి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా భయపడేవాళ్ళు. దీంతో బయట కూడా అదే విధంగా ఉంటాడనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. కానీ సత్య ప్రకాష్ ఒక సద్బ్రాహ్మణుడు. నిత్యం వేద మంత్రాలు పఠిస్తూ సదరు మంత్రాల యొక్క విశిష్టిత గురించి పది మందికి చెప్తాడు. అసలు తాను ఒక వ్యక్తి తో మాట్లాడుతుంటే ముందుగా దైవం గురించే చర్చ ఉంటుంది. అంత దైవ భక్తుడు. మరి విలనిజాన్ని ప్రదర్శించడనికి ముఖ్య కారణం నటన మీద ఆసక్తి. నటనని కూడా దైవంగా భావించాడు. సత్య ప్రకాష్ గురించి ఈ వివరాలన్నింటినీ ప్రముఖ దర్శకులు 'ఏఎస్ రవికుమార్ చౌదరి'(as Ravikumar chowdary)ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

Also read: కాంతార చాప్టర్ 1 ,కొత్తలోక చాప్టర్ 1 ఎవరు గెలిచారు.. ఒక్క పాయింట్ తేడా అంతే

ఒడిస్సా కి చెందిన సత్య ప్రకాష్ తెలుగు చిత్ర పరిశమ్రలో బడా విలన్స్ రాజ్యమేలుతున్న రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేసి తన సత్తా చాటాడు. తన మొదటి చిత్రం నాగార్జున హీరోగా 1991 లో వచ్చిన జైత్ర యాత్ర. తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సినిమాల్లో చేసాడు. ప్రతి సినిమాలో తన బ్రాండ్ ఆఫ్ విలనిజం మాత్రం పక్కా. మొత్తం పదకొండు భాషల్లో సుమారు 500 చిత్రాల వరకు చేసాడు. డైరెక్టర్ గాను ఎంట్రీ ఇచ్చి తన కుమారుడు తో 'ఊల్లాల్లా, ఊల్లాల్లా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.