English | Telugu

యూరప్ లో నాగార్జున, అనుష్కల ఢమరుకం

యూరప్ లో యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, అమదాల అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న తెలుగు మూవీ "ఢమరుకం" షూటింగ్ జరగబోతుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, అందాల యోగా టీచర్ అనుష్క హీరోయిన్ గా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ తెలుగు మూవీ "ఢమరుకం". ఈ చిత్రం ఏప్రెల్ 25 వ తేదీ నుండి యూరప్ లో షూటింగ్ జరుపుకోనుంది. హీరో అక్కినేని నాగార్జున, హీరోయిన్ అనుష్కల మీద రాజు సుందరం నృత్యదర్శకత్వంలో దర్శకుడు శ్రీనివాసరెడ్డి యూరప్ లో ఒక పాటను చిత్రీకరించనున్నారు.


ఈ చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో 50 నిమిషాలకు పైగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయని తెలిసింది. ఢమరుకం అంటే శివుడి చేతిలో ఉండే శక్తివంతమైన ఒక వాద్యపరికరం. ఈ "ఢమరుకం" చిత్రం హీరో నాగార్జున నటిస్తున్న తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావటం, నాగార్జున సినీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ చిత్రం కావటం విశేషం. ఈ చిత్రం రానున్న విజయదశమికి అంటే దసరా పమడుగకు విడుదల చేయనున్నారట.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.