English | Telugu
దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు
Updated : Aug 19, 2023
తెలుగు చిత్రసీమకు సంబంధించిన ఫ్యామిలీస్‌లో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఈ ఫ్యామిలీలో పెళ్లి బాజాలు త్వరలోనే మోగబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరనే వివరాల్లోకి వెళితే.. రామానాయుడు నిర్మాతగా వందకు పైగా సినిమాలు చేసి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. ఆయన వారసులుగా సురేష్ బాబు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. వెంటకేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఇప్పుడు దగ్గుబాటి కుటుంబం నుంచి మూడో తరం కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సురేష్ బాబు తనయుల్లో పెద్ద వాడైన రానా దగ్గుబాటి హీరోగా, నిర్మాతగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. అంతే కాకుండా రీసెంట్‌గా సురేష్ బాబు రెండో తనయుడు దగ్గుబాటి అభిరాం, అహింస సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేశారు.
దగ్గుబాటి అభిరాం ఇకపై ఏ సినిమాలు చేస్తారనే విషయాన్ని పక్కన పెడితే త్వరలోనే అభిరాం పెళ్లి జరగనుంది. కారంచేడుకు చెందిన చినతాత కూతురు కూతురునే ఈ దగ్గుబాటి వారసుడు పెళ్లి చేసుకోబోతున్నారు. నిశ్చితార్థం త్వరలోనే జరగనుందని టాక్ వినిపిస్తోంది. నిశ్చితార్థంతో పాటు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసిన తర్వాతే ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. మరి ఈ వార్తలపై దగ్గుబాటి కుటుంబం ఎలా స్పందిస్తుందో చూద్దాం.