English | Telugu
రికార్డ్ క్రియేట్ చేసిన బాలయ్య..వామ్మో అన్ని కోట్లా!
Updated : Aug 19, 2023
అగ్ర కథనాయకుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఓ వైపు రాజకీయాలు, మరో వైపు యాక్టింగ్ అంటూ దుమ్ము దులిపేస్తున్నారు. ఓ సినిమా పూర్తవుతుందో లేదో నెక్ట్స్ సినిమాను లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా సందర్బంగా అక్టోబర్ 19న రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఓ వైపు షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
అంచనాలతో పాటు అఖండ, వీరసింహా రెడ్డి వంటి వరుస విజయాలను సాధించిన బాలకృష్ణ ట్రాక్ రికార్డ్‌తో ఇప్పుడు భగవంత్ కేసరిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఆయన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. దాని ప్రకారం భగవంత్ కేసరి సినిమాకు ఏకంగా రూ.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బాలయ్య కెరీర్ థియేట్రికల్ బిజినెస్‌లో ఇదో రికార్డ్ అని మీడియా వర్గాలంటున్నాయి. దీనికి ముందు వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకు రూ.73 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంతకు ముందు అఖండ సినిమాకు రూ.54 కోట్లు బిజినెస్ జరిగింది. కానీ వాటన్నింటినీ భగవంత్ కేసరితో బ్రేక్ చేసేసి రికార్డ్ క్రియేట్ చేశారు బాలయ్య.
నందమూరి బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీని డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.
