English | Telugu
నిజాలు బయటపెడుతున్న ఛార్మి
Updated : Apr 9, 2014
అప్పట్లో విజయశాంతి నటించిన "ప్రతిఘటన" చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇపుడు ఛార్మి కూడా అలాంటి పోరాటమే చేస్తుంది. ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ప్రతిఘటన". ఆడపిల్లలపై జరుగుతున్న హత్యాచారాలను, మానభంగాలను, అదే విధంగా రాష్ట్రంలో చెత్త రాజకీయ నాయకులు చేసే అవినీతి వంటి అంశాలపై ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో ఛార్మి న్యూస్ రిపోర్టర్ పాత్రలో నటించింది. ఈ చిత్రం చూసిన ప్రతిఒక్కరికి కూడా సమాజంలో జరుగుతున్న అవినితీ గురించి తెలుస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.