English | Telugu
బయట సుశాంత్ కొత్త సినిమా
Updated : Mar 18, 2014
"అత్తారింటికి దారేది" చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటివరకు తన సొంత నిర్మాణ సంస్థలో నటించిన సుశాంత్ ప్రస్తుతం బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ..."నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ సుశాంత్ కు సరిగ్గా సరిపోతుంది. సుశాంత్ కెరీర్ కు మేలి మలుపుగా నిలిచే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను. "అత్తారింటికి దారేది" చిత్రం తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. అందుకే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాం. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం ఏప్రిల్ లో మొదలవుతుంది" అని అన్నారు. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.