English | Telugu

ఉడ్ లాండ్ లో బాహుబలి పోరాటాలు

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "బాహుబలి". ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలోని ఉడ్ లాండ్ ప్రాంతంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా రెండు రోజులు సెలవులు తీసుకున్న చిత్ర బృందం మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే విడుదలైన మేకింగ్ వీడియో ల వలన ఈ సినిమాపై ఉన్న అంచలనాలను మరింత పెంచాయి. 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.