English | Telugu

తుది శ్వాస విడిచిన నటుడు ఏవియస్

ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, ఏవియస్ అంటే తెలియని వారుండరు. తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ.. కమెడియన్ గా, నటుడిగా, దర్శకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి ఏవియస్ ఇక మనకు లేరు. గతకొద్ది రోజులుగా ఆయన అనారోగ్యం కారణంగా నగరంలోని గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఏం చేయలేకపోయారు. దాంతో మణికొండలొని ఆయన సొంత ఇంటిలో నిన్న(శుక్రవారం) రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏవియస్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పుకోవచ్చు.

1993లో మిస్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు."అదో తుత్తి" అంటూ ఆ సినిమాలో ఆయన వాడిన ఆ ఊతపదం ఎప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేరు. తన సినీ జీవితంలో ఎన్నో మంచి మంచి పాత్రలు వేసి మెప్పించిన ఏవియస్, ఇప్పటికి దాదాపు 500 సినిమాల వరకు నటించారు.

దివంగత ఏవియస్ కు ఘన నివాళి సమర్పిస్తుంది తెలుగువన్.కామ్