English | Telugu

బ‌న్నీ విల‌న్‌తో ప్ర‌భాస్ డిష్యూమ్ డిష్యూమ్?

బాహుబ‌లి సిరీస్ త‌రువాత పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల‌నే టార్గెట్ చేసుకున్నారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. రాధేశ్యామ్, స‌లార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్టోరియ‌ల్.. ఇలా మూడేళ్ళ కాలంలో నాలుగు క్రేజీ పాన్ ఇండియా మూవీస్ తో సంద‌డి చేయ‌నున్నారు. కాగా.. స‌లార్, ఆదిపురుష్ కంటే ముందే అనౌన్స్ అయిన నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుందని స‌మాచారం.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. అంతేకాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ‌రుడు చిత్రంలో విల‌న్ గా న‌టించిన త‌మిళ క‌థానాయ‌కుడు ఆర్య కూడా ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో న‌టించ‌బోతున్నాడని వినికిడి. నెగ‌టివ్ ట‌చ్ ఉన్న రోల్ లోనే ఆర్య క‌నిపిస్తాడ‌ని టాక్. త్వ‌ర‌లోనే ఆర్య ఎంట్రీపై క్లారిటీ రావ‌చ్చు. 2023లో ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ కాంబో మూవీ తెర‌పైకి రానుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది.