English | Telugu

విక్ర‌మ్‌తో న‌భా ఆటాపాటా?

ఇస్మార్ట్ శంక‌ర్ తో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న క‌న్న‌డ క‌స్తూరి న‌భా న‌టేష్.. రీసెంట్ గా రిలీజైన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ తోనూ మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ అంటూ సంద‌డి చేయ‌బోతోంది. ఈ సినిమా త‌రువాత యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న అంధాధున్ రీమేక్ తో నాయిక‌గా ప‌ల‌క‌రించ‌బోతోంది న‌భా.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు క‌న్న‌డ‌, తెలుగు చిత్రాల్లోనే న‌టిస్తూ వ‌స్తున్న ఈ అమ్మ‌డికి కోలీవుడ్ నుంచి పిలుపు వ‌చ్చింద‌ట‌. అది కూడా.. ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ లో నాయిక‌గా న‌టించే అవ‌కాశ‌మ‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. సీనియ‌ర్ హీరో చియాన్ విక్ర‌మ్ - స్టార్ డైరెక్ట‌ర్ హ‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెరకెక్క‌నుంది. ఇందులో ఓ క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం న‌భాకి ద‌క్కింద‌ట‌. న‌భా కూడా ఈ ఆఫ‌ర్ కి వెంట‌నే ఓకే చెప్పింద‌ని టాక్. త్వ‌ర‌లోనే విక్ర‌మ్ - హ‌రి కాంబినేష‌న్ మూవీలో న‌భా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. తెలుగు, క‌న్న‌డ భాషల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన న‌భా.. త‌మిళంలోనూ అల‌రిస్తుందేమో చూడాలి.