English | Telugu

తార‌క్ తో ప్ర‌భాస్ బ్యూటీ?

అర‌వింద స‌మేత వంటి విజ‌య‌వంత‌మైన సినిమా త‌రువాత యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని య‌న్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. అర‌వింద స‌మేత‌కి బాణీలు అందించిన యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ నే య‌న్టీఆర్ 30కి కూడా స్వ‌ర‌క‌ల్ప‌న చేయ‌బోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర కోసం ఇప్ప‌టికే ప‌లువురి పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న‌, స‌మంత‌, కియారా అద్వాని, జాన్వీ క‌పూర్.. ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. తాజాగా ఈ జాబితాలో మ‌రో పేరు చేరింది. ఆ క‌థానాయిక మ‌రెవ‌రో కాదు.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా వెంచ‌ర్ సాహోతో తెలుగువారికి ప‌రిచ‌య‌మైన బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్. మ‌రి.. శ్ర‌ద్ధ కూడా వార్త‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతారో లేదంటే నాయిక‌గా క‌న్ఫామ్ అవుతారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.