English | Telugu

పవన్ కి గాలమేస్తున్న రుద్రమదేవి

పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. అగ్ర హీరోలందరితో నటించిన అనుష్క తన మనసులోని మాటను బయటపెట్టింది. అనుష్క ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కళామందిర్ 20వ షోరూంను అనుష్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం వస్తే "గబ్బర్ సింగ్2" లో హీరోయిన్ గా నటిస్తానని చెప్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు "రుద్రమదేవి", "బాహుబలి" చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఈ అమ్మడి కోరిక పవన్ నెరవేరుస్తాడో లేదో చూడాలి.