English | Telugu

ఆయనని వదలనంటున్న బొమ్మాలీ

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సరసన హీరోయిన్ గా నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. కానీ ఆ అవకాశం అందరికి రాదు. అయితే రజినీతో సినిమా చేసే ఛాన్స్ రావడమే చాలా గొప్ప విషయం. అలాంటి అవకాశాన్ని వదులుకొని ఇపుడు చాలా బాధపడుతుంది అందాల అనుష్క.

రజనీకాంత్‌ తాజా చిత్రం "కొచ్చడయన్". ఈ చిత్రంలో రజినీ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించమని ఈ చిత్ర దర్శకురాలు సౌందర్య ముందుగా అనుష్కనే సంప్రదించింది. కానీ ఆ సమయంలో డేట్స్ ఖాళీ లేకపోవడంతో "కొచ్చడయాన్" సినిమా వదులుకుంది. అయితే ఈ విషయాన్ని అనుష్కనే స్వయంగా వర్ణ ప్రమోషన్‌లో తెలిపింది.మళ్లీ సూపర్‌స్టార్‌‌తో నటించే అవకాశంవస్తే వదులుకునే ఛాన్స్‌లేదంటోంది అనుష్క. మరి అనుష్కకు మరోసారి ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.