English | Telugu

‘అడిగింది తీరుస్తావా’ అంటూ యాంక‌ర్ కు వ‌ర్మ ఆఫ‌ర్‌!

రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌తీ అంశాన్ని వివాదంగా మారుస్తూ వార్త‌ల్లో నిల‌వాల‌నుకుంటారు. అలాగే చేస్తుంటారు కూడా. ఇక త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేసే లేడీ యాంక‌ర్ ల‌తో వ‌ర్మ వ్య‌వ‌హ‌రించే తీరు కూడా వివాదాస్ప‌దంగానే వుంటూ నెట్టింట వైర‌ల్ గా మారుతూ వుంటుంది. డ‌బుల్ మీనింగ్ డైలాగ్ ల‌తో వ‌ర్మ యాంక‌ర్ ల‌పై పంచ్ లు వేస్తూ వుంటాడు. కొన్ని సంద‌ర్భాల్లో యాంక‌ర్ బాగా న‌చ్చితే త‌న‌ని తాను మ‌ర్చిపోయి హ‌ద్దులు దాటేస్తుంటాడు. తాజాగా త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేసిన ఓ యాంక‌ర్ ని ఏకంగా అడిగింది తీరుస్తావా? అంటూ అడిగేశాడు వ‌ర్మ‌.

త్రిగుణ్ హీరోగా వ‌ర్మ రూపొందించి మూవీ `కొండా`. ఈ మూవీ జూన్ 23న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా యాంక‌ర్‌, బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ స్ర‌వంతి ర‌న్నింగ్ బ‌స్ లో వ‌ర్మ‌ని ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూ లో ఎక్కువ‌గా బోల్డ్ గానే వ‌ర్మ స‌మాధానాలు చెప్ప‌డం.. స్ర‌వంతి ప్ర‌శ్నించ‌డం.. ఆ త‌రువాత వ‌ర్మ ప్ర‌శ్నించ‌డం.. స్ర‌వంతి అంతే బోల్డ్ గా స‌మాధానాలు చెప్ప‌డం జ‌రిగింది. ఇక వ‌ర్మ డ‌బుల్ మీనింగ్ డైలాగ్ ల‌తో రెచ్చిపోతే యాంక‌ర్ స్ర‌వంతి కూడా ఎక్క‌డా త‌గ్గేదేలే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన తీరు నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఇక ఇంట‌ర్వ్యూ లో `ఎలా వున్నారు?` అని వ‌ర్మ‌ని ప్ర‌శ్నించింది. దీంతో వ‌ర్మ రెచ్చిపోయాడు. నేను అస్స‌లు బాగాలేను.. నాకు చాలా అవ‌స‌రాలు ఉన్నాయి. అవి మీరు తీరుస్తారా? తీర్చ‌లేన‌ప్పుడు ఎలా వున్నార‌ని ఎలా అడుగుతారు? అన్నాడు. వ‌ర్మ మాట‌ల్ని అర్థం చేసుకున్న స్ర‌వంతి డైరెక్ట్ గానే స‌మాధానం చెప్పింది. `సార్ బ‌స్ లో తీర్చేది.. నా వ‌ల్ల అయ్యేది..ఏ మైనా చిన్న‌ది ఉంటే తీరుస్తా` అని ఆన్స‌ర్ ఇచ్చింది. ఆ మాట‌తో `మీ వ‌ల్ల అయ్యేది చిన్న‌ది అంటే ఎలా.. మీ వ‌ల్ల అయ్యేది పెద్ద‌దే వుంటుంది..` అంటూ మ‌ళ్లీ డ‌బుల్ మీనింగ్ డైలాగ్ వ‌దిలాడు.. ఇప్పుడు వీరిద్ద‌రి సంభాష‌ణ నెట్టింట వైర‌ల్ గా మారింది.