English | Telugu

వచ్చే వారం నుండీ "బద్రీనాథ్" పబ్లిసిటీ షురూ

వచ్చే వారం నుండీ "బద్రీనాథ్" చిత్రం పబ్లిసిటీ షురూ అవుతుందట. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, డైనమిక్ డైరేక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం "బద్రీనాథ్". ఈ "బద్రీనాథ్" చిత్రం యొక్క పబ్లిసిటీ వచ్చే వారం నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ "బద్రీనాథ్" చిత్రం కోసం హీరో అల్లు అర్జున్ వియత్నాం వెళ్ళి అక్కడ ఫైటింగ్ సీన్ల కోసం ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ శిక్షణ ప్రముఖ యాక్షన్ కంపోజర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో జరిగిందట. ఈ "బద్రీనాథ్" చిత్రం షూటింగ్ కులూ మనాలీలో జరిగింది.అక్కడ ఈ "బద్రీనాథ్ ‍" చిత్రం కోసం ఒక భారీ సెట్ ను కూడా నిర్మించారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన "బన్నీ" చిత్రం తర్వాత వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇదే కావటం గమనార్హం. ఈ "బద్రీనాథ్" చిత్రం రానున్న వేసవి శలవుల్లో "మే" నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. హీరో అల్లు అర్జున్ వివాహం అయిన తర్వాత విడుదల కాబోతున్న తొలి చిత్రం "బద్రినాథ్" కావటంతో ఇది సూపర్ హిట్టవ్వాలని అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.