English | Telugu

మరో జులాయి మొదలైంది.

"జులాయి" చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు.

నేడు బన్నీ నటించిన "రేసుగుర్రం" చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.