English | Telugu

ఓటు వెయ్యని వారికి అలా మాట్లాడే హక్కు లేదు : అల్లు అరవింద్‌

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచే ఎన్నికల సందడి మొదలైంది. సామాన్య ప్రజలే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా బాధ్యతగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి అందరితోపాటు క్యూలో నిలబడి ఓటు వేసి.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఓటింగ్‌ శాతం తక్కువగానే ఉందని చెప్పాలి. అయితే ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉంది అని చెప్పుకునే ఆదిలాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 60 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హౖెెదరాబాద్‌లో ఇప్పటివరకు 21 శాతం మాత్రమే ఓట్లు పోలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది హైదరాబాద్‌లో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నతమైన పదవులు నిర్వహిస్తున్నవారు ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనేది గుర్తించకుండా ఓటింగ్‌లో పాల్గొనకపోవడం పలువురిని బాధిస్తోంది.

తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలింగ్‌ శాతం తక్కువగా ఉండడాన్ని తట్టుకోలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటు వెయ్యకుండా ఇంట్లో కూర్చుంటారు చూడండీ.. వాళ్లకి నేను ఒకటి చెబుతున్నా.. డోంట్‌ గ్రిప్‌.. ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు. వాళ్ళు అలాగా.. వీళ్ళు ఇలాగా.. అని మాట్లాడే హక్కు మీకు లేదు. దాన్ని మీ మనసులో కూడా ఉంచుకోకూడదు. అలాంటిదేమైనా ఉందీ అంటే.. మీరు వచ్చి ఓటు వెయ్యండి. ఇవాళ హాలీడేలే అని బీరు తాగి పడుకునేవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.