English | Telugu

రాఘవేంద్రరావును మించిపోతున్న అల్లరోడు

రాఘవేంద్రరావు ఏ సినిమా తీసిన అందులో పండ్లు, పూలు, పాలు వాడటం తప్పనిసరి. అయితే ఈ మధ్య అయన భక్తి చిత్రాల వెంట వెళ్తుండటంతో ఆ పండ్లు, పూలు, పాల భాధ్యత హీరో అల్లరి నరేష్ తీసుకున్నాడు.

అసలే "అల్లరి" సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మనోడు "సీమటపాకాయ్" చిత్రం నుండి పండ్లు, పాలు, పూలను వాడటం మొదలు పెట్టేశాడు. అప్పటి నుండి తాను నటించే ప్రతి చిత్రంలో ఏదో ఒక పాట అలా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం "యాక్షన్-3డి"లో పాలను ఉపయోగించి మరోసారి రాఘవేంద్రరావుకు పోటి వచ్చేలా ప్రయత్నించాడు. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు విజయవంతం అయిందో త్వరలోనే తెలియనుంది.