English | Telugu
ఏమైన రాసుకోండి... నవ్వుకుంట...!
Updated : Aug 5, 2013
సెలబ్రేటిలు అన్నాక రూమర్స్ వంటి వార్తలు రావడం సహజమే. అయితే సినీ తరాలకు మరి ఎక్కువగా రూమర్స్ వస్తుండటంతో తనకు కూడా అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చింది బాలీవుడ్ చిన్న పాప ఆలియాభట్.
ఇటీవలే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు... సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలో తనకు అర్థమైపోయిందని అంటుంది. గత కొద్దిరోజులుగా ఈ అమ్మడు డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వీటిపైన వస్తున్న వార్తలను చూసి నవ్వుకుంటానని తెలిపింది. అర్థం లేని వాటి గురించి ఎవరు ఏం రాసిన కూడా పట్టించుకోనని చెప్పేసింది. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే అందరికి తెలిసేలా ధైర్యంగా చెబుతానని ఈ బేబి చెప్పుకొచ్చింది.
ప్రేమలో పడితే ధైర్యంగా చెపుతానని అని చెప్పిందే కానీ...మరి ఇలా డేటింగ్ చేసే సంగతుల గురించి ఎందుకు చెప్పట్లేదని ఈ అమ్మడిపై బాలీవుడ్ ఇండస్ట్రీ జోకులేసుకుంటున్నారు.