English | Telugu
తారస్థాయిలో "ధూమ్-3" హక్కులు..!
Updated : Aug 6, 2013
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "ధూమ్-3". యాశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్ర శాటిలైట్ హక్కులను సోనీ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ కు దాదాపు 75 కోట్ల రూపాయలకు అమ్మినట్లు సమాచారం. అమీర్ ఖాన్ దొంగ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కత్రినాకైఫ్, అభిషేక బచ్చన్, ఉదయ్ చోప్రా వంటి పలువురు తారాగణం కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.