English | Telugu

మా పెళ్ళికి నాన్న ఒప్పుకోవట్లేదు

"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ ఆలియా భట్. ఈ అమ్మడు తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. తన అందాలను ఎక్కువగా ప్రదర్శిస్తూ హాట్ హాట్ గా కనిపించడం ఈ అమ్మడి ప్రత్యేకత. అయితే ఆలియా ప్రస్తుతం "2 స్టేట్స్" చిత్రంలో నటిస్తుంది. ఇందులో బాయ్ ఫ్రెండ్ తో లిప్ లాక్ సన్నివేశం ఉంది. ఈ విషయం గురించి మీడియా అడిగితే... ఆలియా స్పందిస్తూ..."అది సినిమా కాబట్టి ఏమీ అనలేదు.. అదే రియల్ గా నేనటువంటి పనిచేస్తే చెంప ఛెళ్లుమనిపిస్తాడు. అంతేకాదు.. మా నాన్నకి మేమంటే చాలా ప్రేమ. అక్కని, నన్నూ ఎక్కడికి పోనివ్వడు. మీ ఇద్దరినీ ఓ గదిలో వేసి తాళం పెడతాను అని అంటాడు కూడా. అందుకే ఆయన మాకు పెళ్లి చేయడానికి సైతం ఇష్టపడటం లేదు" అని చెప్పుకొచ్చింది.