English | Telugu

రాజమౌళి ముందున్న సవాళ్లు అవే.. వాటిని అధిగమించి ‘వారణాసి’ని రిలీజ్‌ చెయ్యగలడా?

Publish Date:Jan 6, 2026

- షూటింగ్‌ దశలోనే ఉన్న వారణాసి - ‘వారణాసి’ రిలీజ్‌పై భిన్నాభిప్రాయాలు - సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసిన అంశాలు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాల హవా కొనసాగుతోంది. టాప్‌ స్టార్స్‌ అంతా పాన్‌ ఇండియా మూవీస్‌పైనే దృష్టి పెట్టారు. దానికి తగ్గట్టుగానే సినిమాలో అనేకానేక హంగులు సమకూర్చే పనిలో ఉన్నారు. ఎన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ అందరి దృష్టీ మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి చిత్రంపైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే అనేక విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా క్షణాల మీద అది వైరల్‌గా మారిపోతోంది.    ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి, ఇందులో మహేష్‌ కనిపించే ఐదు పాత్రల గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా సినిమా రిలీజ్‌ డేట్‌ గురించి భారీగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ డిస్కషన్‌ ఎక్కువైంది. వారణాసి 2027 మార్చిలో రిలీజ్‌ అవుతుందని కొందరంటుంటే, మరికొందరు ఆ సంవత్సరం శ్రీరామనవమికి రిలీజ్‌ అవుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో బలం లేకపోయినా ఈ వార్తలు మాత్రం వైరల్‌ అవుతున్నాయి.    ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి రాజమౌళికే కాదు, చిత్ర యూనిట్‌లోని ఎవ్వరికీ క్లారిటీ లేదనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ వస్తున్న వార్తల్లో నిజానిజాలేమిటి అని ఆలోచించకుండా వైరల్‌ చేసేస్తున్నారు. ఆమధ్య రామోజీ ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో 2027లో వారణాసి చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించాడు రాజమౌళి. అయితే అది ఏ నెలలో అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే, అసలు 2027లో సినిమా రిలీజ్‌ ఉంటుందా లేదా సందేహం అందరిలోనూ మొదలైంది.    ఇప్పటివరకు సగం షూటింగ్‌ మాత్రమే పూర్తయింది. బ్యాలెన్స్‌ షూటింగ్‌ను ఎంత వేగంగా పూర్తి చేసినప్పటికీ ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం చాలా టైమ్‌ తీసుకుంటాడు రాజమౌళి. తను అనుకున్న క్వాలిటీ వచ్చే వరకు కాంప్రమైజ్‌ అవ్వడని అతని గత సినిమాల ద్వారా తెలుసుకున్నాం. ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాను ఐమాక్స్‌ ఫార్మాట్‌లో కూడా చేస్తున్నారు కాబట్టి రాజమౌళి చెప్పినట్టు 2027లో ‘వారణాసి’ రిలీజ్‌ అవుతుందని చెప్పడం కష్టమే.    ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. మరో సంవత్సరంలో ఈ పనులన్నీ పూర్తి చెయ్యడం సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ ‘వారణాసి’ చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్‌గా చేస్తున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే.. ఇతర హీరోల సినిమాలు 2027లోనే థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. ఎన్టీఆర్‌, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా, ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమా డ్రాగన్‌, ప్రభాస్‌, సందీప్‌రెడ్డి మూవీ స్పిరిట్‌ వంటి సినిమాలు 2027నే టార్గెట్‌ చేశాయి. వారణాసి సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చెయ్యాలంటే రాజమౌళి ముందు ఇన్ని సవాళ్లు ఉన్నాయి. మరి వీటిని ఎదుర్కొని తను అనుకున్న విధంగా సినిమాను రిలీజ్‌ చెయ్యగలడా? లేదా? అనేది వేచి చూడాలి. 

CBI summons Thalapathy Vijay in Karur Stampede Case

Publish Date:Jan 6, 2026

Thalapathy Vijay has been trying to bring in a change in political environment of Tamil Nadu, which is dominated by DMK and AIADMK. He is eyeing to become Chief Minister of the state moving forward with his political party, TVK. But he is currently, in a huge soup with the Karur Stampede Case.  Government has handed over the case to CBI, after Vijay stated that he doesn't belive in TN Government and they have planned security lapses to put him in the pickle. Well, CBI has summoned Vijay to appear before them on 12th January, for the inquiry.  The actor-politician is currently looking at his final movie, Jana Nayagan release this weekend on 9th January. The movie is a remake of Bhagavanth Kesari and it is clashing with The Raja Saab, starring Prabhas. At the moment, except for fans of Vijay, no one is really interested to watch JN, being a remake.  But the one last film of Vijay sentiment might work in favor of it. Mamitha Baiju, Pooja Hegde and Bobby Deol are playing prominent lead roles in the film and H.Vinoth has directed it. It looks like before election, TN will see more drama than ever surrounding Vijay, with this incident.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

ఇళయరాజా వల్లే ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యాడు.. ఎలాగంటే?

Publish Date:Jan 5, 2026

(జనవరి 6 ఎ.ఆర్‌.రెహమాన్‌ పుట్టినరోజు సందర్భంగా..)   - రెహమాన్‌ను ఇళయరాజా ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు? - ఇళయరాజా, రెహమాన్‌ మధ్య గొడవకు కారణమైన సినిమా ఏది? - మణిరత్నం, ఇళయరాజా కాంబినేషన్‌ బ్రేక్‌ అవ్వడానికి కారణం ఎవరు?   సంగీతాన్ని ఆస్వాదించనివారు ఎవరూ ఉండరు. ఏదో ఒక సందర్భంలో తమకు నచ్చిన సంగీతాన్ని వింటూ సేద తీరుతుంటారు. సినిమా అనేది మొదలైన తర్వాత ఆ సంగీతానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటల పాత్ర ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. వందేళ్లు పైబడిన ఇండియన్‌ సినిమాల్లో ఎంతో మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ తమ సంగీతంతో అలరించారు. దక్షిణ భారత చిత్రాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎంతో మంది టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఎప్పటికీ మర్చిపోలేని పాటల్ని అందించారు.    సినీ సంగీతంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వారిలో ఇళయరాజాను ప్రధానంగా చెప్పుకోవాలి. అప్పటివరకు వస్తున్న సంగీతానికి భిన్నమైన సంగీతాన్ని శ్రోతలకు పరిచయం చేశారు ఇళయరాజా. శ్రోతలకు వీనుల విందైన సంగీతాన్ని అందించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక దశలో సౌత్‌ ఇండియన్‌ సినిమా సంగీతాన్ని శాసించిన ఇళయరాజా.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన తర్వాత అంతటి ప్రభావాన్ని వేసిన సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకొని ఇళయరాజాను సైతం పక్కన పెట్టే స్థాయికి వెళ్లిపోయాడు.    ఎ.ఆర్‌.రెహమాన్‌ అనే సంగీత దర్శకుడు పరిచయం కావడం వెనుక ఇళయరాజా హస్తం ఉందనే విషయం చాలా మందికి తెలీదు. ఒక విధంగా అతని కాంపౌండ్‌ నుంచి వచ్చినవాడే రెహమాన్‌. సంగీత దర్శకుడు కాక మునుపు కమర్షియల్స్‌కు జింగిల్స్‌, స్టేజ్‌ షోలు చేసేవాడు. ఆ క్రమంలోనే ఇళయరాజా దగ్గర ప్రోగ్రామర్‌గా జాయిన్‌ అయ్యాడు. ఎన్నో సినిమాలకు ఇళయారాజా దగ్గర పనిచేశాడు. అలా ఆయన దగ్గర నుంచి సినిమా సంగీతానికి సంబంధించిన ఎన్నో మెళకువలు తెలుసుకున్నాడు.    నాగార్జున, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నప్పుడు ఒక చిన్న విషయంలో హర్ట్‌ అయిన ఇళయరాజా.. రెహమాన్‌ను తన స్టూడియో నుంచి ఇంటికి పంపించేశారు. డైరెక్టర్‌ మణిరత్నం సమక్షంలోనే ‘జల్లంత కవ్వింత కావాలిలే..’ అనే పాటను కంపోజ్‌ చేస్తున్నారు ఇళయరాజా. ఆ పాట నడకలో కొన్ని మార్పులను తన అభిప్రాయంగా చెప్పాడు రెహమాన్‌. అది ఇళయరాజాకు నచ్చలేదు. దాంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ సమయంలో రెహమాన్‌ చేసిన సూచనలు మణిరత్నంకు బాగా నచ్చాయి.    ఇది జరిగిన కొన్నాళ్లకు తమిళ దర్శకుడు కె.బాలచందర్‌ తన సొంత నిర్మాణ సంస్థలో మణిరత్నం దర్శకత్వంలో ‘రోజా’ చిత్రం చెయ్యాలనుకున్నారు. అప్పటివరకు మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ ఇళయారాజాయే సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ప్రారంభమయ్యే నాటికి లండన్‌లో సింఫనీ చేసే పనిలో ఉన్నారు ఇళయరాజా. అప్పుడు మణిరత్నం మనసులో రెహమాన్‌ కదిలాడు. ఇదే విషయాన్ని కె.బాలచందర్‌కి చెప్పారు. వెంటనే అతన్ని పిలిపించి ఒక పాటకు ట్యూన్‌ చెయ్యమన్నారు. అలా రెహమాన్‌ మొదట ట్యూన్‌ చేసిన పాట ‘చిన్ని చిన్ని ఆశ..’. ఈ ఈ ట్యూన్‌ మణిరత్నంకి, బాలచందర్‌కి బాగా నచ్చింది. అలా ‘రోజా’ చిత్రానికి సంగీతం సమకూర్చే బాధ్యతను రెహమాన్‌కి అప్పగించారు.    ‘రోజా’ సినిమాతో మొదలైన మణిరత్నం, రెహమాన్‌ల సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 19 సినిమాలు వచ్చాయి. అంతకుముందు ఇళయరాజా కాంబినేషన్‌లో 10 సినిమాలు చేశారు మణిరత్నం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా దళపతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇళయరాజాతో కలిసి సినిమా చెయ్యలేదు మణిరత్నం. అప్పటి నుంచి రెహమాన్‌తోనే కొనసాగుతున్నారు. తన కెరీర్‌లో 29 సినిమాలు డైరెక్ట్‌ చేసిన ఆయన ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్లతో మాత్రమే మ్యూజిక్‌ చేయించుకోవడం విశేషం. 

విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం 

Publish Date:Jan 5, 2026

        -భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం  -16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి -సోషల్ మీడియా వేదికగా  మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి -మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!       ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో  సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.   మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా  కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల  నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే  ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.     Also read:  ధురంధర్ తో కొత్త లోక  కలిస్తే.. మీకు ఓకేనా!     పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్   రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక  జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే  కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్  నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.  

గోవాలో బట్టల్లేకుండా క్లిప్స్ తీసిన రాంప్రసాద్!

Publish Date:Jan 6, 2026

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. "ఫామిలీ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్" పేరుతో షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో స్టార్టింగ్ లో పంచ్ ప్రసాద్, వాళ్ళ వైఫ్ సునీత, రాంప్రసాద్ మధ్య జరిగిన కామెడీ కన్వర్జేషన్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. "బాబాయ్ గా మొన్న మీ రీల్స్ చూసాను ఇంకొన్ని రీల్స్ చేయొచ్చుగా" అని రాంప్రసాద్ పంచ్ ప్రసాద్ ని అడిగాడు. "చేద్దామనుకున్నాను ఎక్కడా ఉత్తినే నీరసపడిపోతేనూ" అంటూ వాళ్ళావిడ సునీత మీద కౌంటర్లు వేసాడు పంచ్ ప్రసాద్. "అబ్బో సర్ శక్తిమాన్ 3 డి మరి" అని సునీత డైలాగ్ వేసేసరికి స్టేజి మీద ఉన్న అందరూ నవ్వేశారు. "చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్" అంటూ ప్రసాద్ మళ్ళీ సీరియస్ అయ్యాడు. "నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా" అని రివర్స్ కౌంటర్ ఇచ్చేసింది. అంతే అందరూ నవ్వేశారు. ఇక తర్వాత సింగర్ లిప్సిక వచ్చి అదిరిపోయే సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేసింది. తర్వాత ఒక సెగ్మెంట్ చేశారు. పెద్ద పెద్ద రోలింగ్ డ్రమ్స్ మీద ఒక ఫ్లాట్ గా ఉన్న చెక్కతో చేసిన మ్యాట్ వేశారు. ఆ డ్రమ్స్ రోల్ అవుతూ ఉంటె అటు ఇటు ఆ మ్యాట్ మీద పండు "ఇటుక మీద ఇటుక" సాంగ్ ని చేసాడు. ముందు చేసిన పంచ్ ప్రసాద్ మాత్రం సరిగా చేయలేకపోయాడు.  అలాగే ఇంకో ఇంటరెస్టింగ్ సెగ్మెంట్ కూడా పెట్టారు.  ఒక ఎక్వేరియంలో వాటర్ పోసి ఒక నిమ్మకాయ వేసి ఆ తేలే నిమ్మకాయ మీద కాయిన్ ని బాలన్స్ చేయాలనీ చెప్పింది రష్మీ. సుహాసిని, ఆదర్శ్, పంచ్ ప్రసాద్, తాగుబోతు రమేష్ వంటి వాళ్లంతా ట్రై చేశారు. తర్వాత  వైరల్ వంటలక్క ధరణి - ఆదర్శ్ కలిసి "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక నాటీ నరేష్ వచ్చి "మొన్న గోవా వెళ్ళావ్ కదా ఏవన్నా ఫొటోస్ తీసావా" అంటూ నాటీ నరేష్ రాంప్రసాద్ ని అడిగాడు. "బట్టల్లేకుండా క్లిప్స్ తీసా కొన్ని" అంటూ రాంప్రసాద్ చెప్పాడు. "మరి చూపించవా.. నేనెవరికీ చెప్పా" అన్నాడు నరేష్. "అసలు బట్టల్లేకుండా క్లిప్స్ తీయడం చాలా కష్టం తెలుసా" అంటూ రాంప్రసాద్ బట్టలకు పెట్టుకునే క్లిప్స్ తీసి చూపించాడు అంతే నరేష్ పడీ పడీ నవ్వుకున్నాడు. "ఫామిలీ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్"లో అంతా రకరకాల ఫోజులతో ఫొటోస్ దిగారు.

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Is Allu Arjun and Lokesh movie Irumbukai Mayavi?

Publish Date:Jan 5, 2026

Allu Arjun revealed in his previous interviews that he always has been intended to grow his market in Tamil Nadu. He stated that he was born in Chennai and brought up there till they moved to Hyderabad, hence, he wanted to debut in Tamil language. Now, he is working with Atlee, on a Pan-India film, in Sun Pictures production.  His next film is said to be directed by Lokesh Kanagaraj while there is a huge amount of confusion, if he would work with Trivikram Srinivas on God of War or not. The actor is known to take one film at a time but he announced his next big projects before Pushpa and then scrapped most of them.  Now, he might wait for Atlee's movie to finish shoot and then decide on his next project. Or he might look at the reception and decide on his future project, if it should be Pushpa 3 or not. For now, the gossips are strong about Lokesh directing Allu Arjun and it would be Irumbukai Mayavi.  Lokesh earlier stated that he used most of the scenes and plot points from his IM script that he wanted to do with Suriya. He also stated that many want him to go back to that script but he is writing fresh ideas. Aamir Khan has expressed his frustration about his cameo in Rajinikanth's Coolie.  So, Lokesh Kanagaraj is forced to scrap his potential project with Aamir. He did talk about taking LCU forward with Kaithi 2 but the project is not moving forward as anticipated due to his fees and budget disputes. There is all chance for Allu Arjun to act in Lokesh's direction but will it start immediately?  Even close circles of the actor and director cannot say, it for sure. Currently, Allu Arjun could be concentrating only on delivering another big grosser after Pushpa 2 with Atlee's film to grow his market and solidify it. So, the discussion about story with Lokesh might not have started yet as some reports suggest.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969