English | Telugu

ధురంధర్ తో కొత్తలోక కలిస్తే.. మీకు ఓకేనా!

ఊహించని కాంబోకి ముహూర్తం ఫిక్స్ అవుతుందా!
ఇండియన్ సినీ సర్కిల్స్ లో మరో సంచలనం తప్పదా!
బాలీవుడ్ మీడియా వర్గాలు ఏమంటున్నాయి
ప్రలే వెనక ఉన్న కథ ఏంటి!
కళ్యాణి ప్రియదర్శన్, రణవీర్ సింగ్ ఇప్పుడు ఏం చేస్తుందా

ఒకే ఒక్క సూపర్ హిట్టు.. అందరి నోళ్లు మూయించడమే కాకుండా సినీ ఎవరెస్టు శిఖరంపై కూర్చోబెడుతుంది. అలా 'కొత్త లోక చాప్టర్ 1'(అనే ఒకే ఒక్క హిట్ తో అందరి నోళ్లు మూయించి సినీ ఎవరెస్ట్ శిఖరంపై కూర్చున్న నటి 'కళ్యాణి ప్రియదర్శన్'(kalyani Priyadarshan)పైగా హీరోలు రాజ్యమేలుతున్న రోజుల్లో సోలో హీరోయిన్ గా పాన్ ఇండియా హిట్ ని అందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు కళ్యాణి ఖాతాలోకి ఒక భారీ బాలీవుడ్ మూవీ వచ్చి చేరినట్టుగా ఇండియన్ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

ధురంధర్(Dhurandhar)తో 'రణవీర్ సింగ్' (Ranveer Singh)సృష్టిస్తున్న సంచలనం ఇంకా థియేటర్స్ లో కొనసాగుతూనే ఉంది. మార్చి లో దురంధర్ సీక్వెల్ తో థియేటర్స్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రం తర్వాత 'ప్రలే' అనే మూవీ రణవీర్ చేయబోతున్నాడనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తూ వస్తున్నాయి. జై మహతా దర్శకుడు. జాంబీ థ్రిల్లర్ కధాంశాలతో తెరకెక్కబోతుందనే ప్రచారం కూడా ఎప్పట్నుంచో ఉంది. ఈ మూవీలోనే రణవీర్ సింగ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ జత కట్టబోతుందనే న్యూస్ బాలీవడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

Also Read:విజయ్ కి బాలకృష్ణ భరోసా.. సీఎం పక్కానా!


ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, మూవీ లవర్స్ స్పందిస్తు రణవీర్ సింగ్,కళ్యాణి ప్రియదర్శన్ తమ ప్రీవియస్ చిత్రాల ద్వారా ఇండియన్ సినీ సర్కిల్స్ లో సరికొత్త ఇమేజ్ ని సంపాదించారు. అలాంటిది ఈ ఇద్దరి కాంబో సెట్ అయితే కనుక సదరు చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పడం పక్కా అనే కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం జెనీ, మార్షల్ అనే తమిళ చిత్రాల్లో చేస్తుంది.