English | Telugu
సునీల్‌కి అనసూయ ఓకే చెప్పిందా?
Updated : Jan 11, 2021
వెటరన్ యాక్టర్ సునీల్.. తాజాగా వేదాంతం రాఘవయ్య అనే చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. స్వల్ప విరామం తరువాత ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు సునీల్. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథని అందించడంతో పాటు సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. సి. చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది.
కాగా, ఇందులో సునీల్ కి జోడీగా అనసూయ నటించబోతున్నట్లు సమాచారం. అభినయానికి అవకాశమున్న పాత్ర కావడంతో.. ఈ సినిమాలో నటించేందుకు ఈ జబర్దస్త్ బ్యూటీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే వేదాంతం రాఘవయ్యలో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం అనసూయ.. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న రంగమార్తండలోనూ, మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఖిలాడిలోనూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే నిహారిక కొణిదెలతో కలసి ఓ వెబ్ సిరీస్ లో దర్శనమివ్వనున్నారు.