English | Telugu
'వినరో భాగ్యము విష్ణుకథ'లో మురళీశర్మ ప్రేమకథ!
Updated : Jan 10, 2023
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
'వినరో భాగ్యము విష్ణుకథ' టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఒక డెన్ లో మనీ హేస్ట్ గెటప్స్ లో ఓ గ్యాంగ్ ఉండగా.. వారితో హీరో తన కథ పంచుకుంటున్నట్లుగా రూపొందించిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఒక్కో సన్నివేశం చెప్తుంటే.. లవ్వా? కామెడీనా? థ్రిల్లరా? అంటూ ఆ గ్యాంగ్ ఎగ్జైట్ మెంట్ తో అడుగుతుండగా.. "కాన్సెప్ట్ తో మొదలై.. లవ్, కామెడీ మిక్సయ్యి.. క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు" అంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశాడు కిరణ్ అబ్బవరం. లవ్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో టీజర్ మెప్పిస్తోంది. ముఖ్యంగా లవర్ బాయ్ గా మురళి శర్మ పండించిన కామెడీ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కాశ్మీర హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా డేనియల్ విశ్వాస్, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.