English | Telugu
ఆస్కార్ కోసం ప్రయత్నిస్తున్న విక్రమ్!
Updated : Jul 4, 2023
ఏ సినిమాకు సైన్ చేసినా, ప్రాణం పెట్టి పనిచేస్తారు విక్రమ్. తీసుకున్న ప్రతి రూపాయికీ న్యాయం జరిగేలా చెమటోడుస్తారు. విక్రమ్ మూవీ రిలీజ్ అంటే, థియేటర్లకు జనాలు బారులు తీయడానికి కారణం కూడా అదే. ఎప్పుడూ తన విశ్వరూపాన్ని ఆఫ్టర్ రిలీజ్ చూపించే విక్రమ్, ఈ సారి మొదటి నుంచీ తన కేరక్టర్‌ని జనాలకు ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తంగలాన్ సినిమాలో విక్రమ్ లుక్ చూసిన వారు, ఆ ట్రాన్స్ ఫర్మేషన్‌కి కళ్లు చెదిరిపోతున్నాయని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా సరే, అన్నీ అవార్డులు విక్రమ్‌కి వచ్చి తీరుతాయని జోస్యం చెబుతున్నారు.
జనాలే కాదు, మేకర్స్ కూడా సేమ్ నమ్మకంతో ఉన్నారు. విక్రమ్ సినిమా ఆస్కార్ బరిలో అవార్డుల పంట పండిస్తుందని అంటున్నారు నిర్మాతలు. ధనుంజయన్ ఆ మధ్య మాట్లాడుతూ ``విక్రమ్ నటిస్తున్న తంగలాన్ సినిమా మా దృష్టిలో చాలా స్పెషల్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో పనిచేసిన వర్కర్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కిస్తున్నాం. పా.రంజిత్ సినిమాలంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఇది ఇంటెన్స్ కా బాప్ అన్నట్టు సాగుతుంది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ కి కూడా నచ్చుతుంది. విక్రమ్ యాక్టింగ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది. అసలు ఈ గెటప్‌లో విక్రమ్‌ని చూసి చాలా మంది గుర్తు పట్టలేదు. అంతగా కేరక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు`` అని అన్నారు. విక్రమ్ సినిమాలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ నాయికలుగా నటిస్తున్నారు. ఫైనల్ ప్రొడక్షన్‌లో ఉంది సినిమా. ఈ ఏడాది ఆఖరున గానీ, సంక్రాంతికి గానీ సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్‌లో ఉంది యూనిట్.