English | Telugu

త‌రుణ్ భాస్క‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ!

త‌రుణ్ భాస్క‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ!

రౌడీ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న్ని హీరోగా నిల‌బెట్టిన సినిమా పెళ్లిచూపులు. త‌ర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హీరో రేంజ్‌కు చేరుకున్నారు. అయితే పెళ్లి చూపులు మాత్రం విజ‌య్‌కి హీరోగా గుర్తింపునిచ్చింది. ఆ త‌ర్వాత ఎందుక‌నో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌లేదు. పెళ్లి చూపులు రిలీజై ఏడేళ్లు అవుతోంది. అయితే తాజాగా త‌రుణ్ భాస్క‌ర్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నుందంటూ స్వ‌యంగా విజ‌య్ దేవ‌రకొండ అనౌన్స్ చేయటం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. త‌రుణ్ భాస్క‌ర్ రాసిన స్క్రిప్ట్‌ను రీసెంట్‌గా తాను లాక్ చేశాన‌ని, త్వ‌ర‌లోనే ఇద్ద‌రి కల‌యిక‌లో సినిమాను చూస్తారంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ కీడా కోలా స్టేజ్‌పై చెప్పారు.

త‌రుణ్ భాస్క‌ర్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కీడా కోలా చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. దీనికి తరుణ్ భాస్కర్ డైరెక్ష‌న్ చేశారు.  రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై కె.వివేక్ సుధాంగ‌, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చిన సంద‌ర్భంలో త‌రుణ్ భాస్క‌ర్‌తో సినిమా గురించి అనౌన్స్ చేశారు. అయితే ప్ర‌స్తుతం మ‌న రౌడీ స్టార్ ఓ వైపు ప‌రశురాం మూవీ ఫ్యామిలీ స్టార్ సినిమా తెర‌కెక్కుతోంది. మ‌రో వైపు జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సెట్స్ పై ఉంది. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ రెండు చిత్రాల‌తో బిజీగా ఉంటార‌న‌టంలో సందేహం లేదు. ఆ త‌ర్వాతే త‌రుణ్ భాస్క‌ర్ సినిమా ఉంటుంది. పెళ్లిచూపులు వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను అందించిన వీరిద్ద‌రూ ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి మ‌రి.