English | Telugu
షాకిచ్చిన తమ్ముడు.. విజయ్ ఏం చేస్తాడు..?
Updated : Jun 9, 2025
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'కింగ్ డమ్' (Kingdom). సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా, జులై 4కి వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టుకు వాయిదా పడినట్లు న్యూస్ వినిపిస్తోంది.
నిజానికి జులై 4 తేదీపై నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న 'తమ్ముడు' (Thammudu) మూవీ మొదట కర్చీఫ్ వేసింది. కానీ, 'కింగ్ డమ్' కోసం ఆ డేట్ ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైం పడుతుండటంతో.. 'కింగ్ డమ్' జులై 4కి రావడం కష్టమనే ప్రచారం మొదలైంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ.. సడెన్ గా 'తమ్ముడు' మూవీ మళ్ళీ తెరపైకి వచ్చింది.
'తమ్ముడు' సినిమా ప్రమోషన్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ ను జూన్ 11న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, ముందుగా అనౌన్స్ చేసినట్టుగానే సినిమాని జులై 4న రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
'తమ్ముడు' టీం ప్రకటనతో.. 'కింగ్ డమ్' వాయిదాపై క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో అడుగు పెట్టే అవకాశముంది.