English | Telugu

మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా
కొత్త విడుదల తేదీ ప్రకటించిన బుచ్చిబాబు
మార్చి 26న పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'

ఈ ఏడాది మార్చి 27న విడుదల కానున్న రామ్ చరణ్ 'పెద్ది'(Peddi) వాయిదా పడిందని, దీంతో అదే సమయంలో మార్చి 26న పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) విడుదల కానుందని ఇటీవల ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే 'ఉస్తాద్ భగత్ సింగ్'ను మార్చి 26న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు కూడా తమ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

'ఉస్తాద్ భగత్ సింగ్'ను 2026 వేసవిలో విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ముందు నుంచీ ఉన్నారు. ఇక మార్చి 27న విడుదల కావాల్సిన 'పెద్ది' కూడా వాయిదా పడటంతో.. మార్చి 26 ని రిలీజ్ డేట్ గా లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. వింటేజ్ లుక్ లో పవర్ స్టార్ కనిపించిన తీరు అదిరిపోయింది.

Also Read: రెండు షాట్ల కోసం ఆరు నెలలు.. మహేష్ ని మార్చేసిన జక్కన్న!

'గబ్బర్ సింగ్' కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా ఆకట్టుకుంది.

గతేడాది సెప్టెంబర్ లో 'ఓజీ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న పవన్, ఈ ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.